ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రైతుబంధు అర్హుల జాబితా అందజేత - telangana varthalu

తెలంగాణలో రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు అవసరమవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

తెలంగాణ : రైతుబంధు అర్హుల జాబితా అందజేత
తెలంగాణ : రైతుబంధు అర్హుల జాబితా అందజేత

By

Published : Jun 13, 2021, 6:17 PM IST

తెలంగాణలో రైతుబంధు పథకానికి అర్హులైన రైతుల జాబితా సీసీఎల్‌ఏ అందజేసిందని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతుబంధు పథకానికి 63.25లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18లక్షల ఎకరాలకు 7508.78 కోట్ల రూపాయలు అవసరమవుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గత యాసంగి కన్నా 2.81లక్షల మంది రైతులు పెరిగారని...నూతనంగా 66,311ఎకరాలు ఈ పథకంలో చేరాయని మంత్రి తెలిపారు. రైతుబంధు నిధులు ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాలలో జమ అయితామని వ్యవసాయశాఖ మంత్రి స్పష్టం చేశారు. మొదటిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన నకలు అందించాలని మంత్రి సూచించారు.

బ్యాంకుల విలీనంతో ఐఎఫ్ఎస్​సీ కోడ్​లు మారిన ఖాతాదారులు ఆందోళన చెందవద్దని... ఏమైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,72,983 మంది రైతులు అర్హులుండగా... 12.18 లక్షల ఎకరాలకు 608.81 కోట్లు నిధులు అవసరం అవుతాయన్నారు. అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 39,762 మంది రైతులు అర్హులుండగా.. 77 వేల ఎకరాలకు 38.39 కోట్లు నిధులు అవసరమవుతున్నాయని పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్, ములుగు, మేడ్చల్‌ జిల్లాలకు 100కోట్లలోపు నిధులు అవసరంగా ఉన్నాయన్నారు. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గానూ రూ.14,656.02 కోట్లు, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్​లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదించినట్లు మంత్రి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details