వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచేలా.. రాష్ట్రంలో 108, 104 సర్వీసులను మరింత పటిష్టపరచాలని ప్రభుత్వం సంకల్పించింది. కొత్తగా 108 అంబులెన్సులు, 104 సంచార వాహనాల కొనుగోలుకు నిర్ణయించింది. మండలానికి ఒక 108 వాహనంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అదనపు వాహనాలు కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. 104 సంచార వాహనాలు కొత్తగా 676 కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఈ దిశగా ప్రభుత్వంపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోనున్నారు. వాయిదా పద్ధతిలో వాహనాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మండలానికో 108 వాహనం... ప్రభుత్వ నిర్ణయం - 108 and 104 Ambulance
108, 104 సర్వీసులను మరింత పటిష్ట పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయనున్నారు. ఒకేసారి మొత్తం ఆర్థిక భారం పడకుండా... వాయిదా పద్ధతిలో చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది.
మండలానికో 108 వాహనం