Ganja seized: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాంనగర్ ఠాణా పోలీసులు శనివారం చిచ్పల్లి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. మంథని పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాచిడి శ్రీనివాస్‌గౌడ్, గంట శంకర్ రెండు వేర్వేరు కార్లలో గంజాయి తరలిస్తూ ఈ తనిఖీల్లో పట్టుబడ్డారు. రెండు వాహనాల్లో రూ.32 లక్షల విలువైన 103.83 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయి, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.
అక్షరాలు చెప్పాల్సినవాడు.. అక్రమానికి పాల్పడ్డాడు! - కరీంనగర్ తాజా నేర వార్తలు
Ganja seized: అతడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అక్షరాలు దిద్దించే చేతులతో అక్రమ రవాణాకు పాల్పడ్డాడు.. పిల్లలను సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన అతడే వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు..! చివరికి పోలీసులకు అడ్డంగా చిక్కాడు...
గంజాయి రవాణాకు పాల్పడిన ఉపాధ్యాయుడు
శ్రీనివాస్‌గౌడ్ మంథనిలోని బెస్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని మామ తెరాస మండలస్థాయి నేత. ఆంగ్ల బోధన శిక్షణ తరగతులకు శ్రీనివాస్‌గౌడ్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నాడని ఎంఈవో లక్ష్మి తెలిపారు.
ఇదీ చదవండి: విద్యార్థులపై దాడి చేసిన దర్జీ.. పోలీసులు ఏం చెప్పారంటే..?