ఆయిల్ పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులు పండించిన ఆయిల్ పామ్ గెలలను టన్ను 18వేలకు ఏపీ ఆయిల్ ఫెడ్ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన ధరను ఏప్రిల్ 20 నుంచి అమలు చేయాలని ఆయిల్ ఫెడ్‌కు ప్రభుత్వం నిర్దేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రకటించిన మద్దతు ధర మన రైతులకు దక్కేలా సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్నబాబు తెలిపారు.
ఆయిల్‌పామ్ రైతులకు అండగా ప్రభుత్వం: కన్నబాబు - Kannababu Latest News
ఆయిల్‌పామ్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. టన్ను రూ.18 వేలకు ఆయిల్‌ఫెడ్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పెంచిన ధర ఈ నెల 20 నుంచి అమలుచేయాలని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో ఇచ్చే మద్దతు ధర ఇక్కడా ఇవ్వాలని సీఎం చెప్పారని కన్నబాబు వివరించారు. పామాయిల్ గెలలను ప్రైవేటుగా అమ్మి మోసపోవద్దని మంత్రి కన్నబాబు సూచించారు.
పెరిగిన రవాణా ఛార్జీలకు అనుగుణంగా 15 కిలోమీటర్ల లోపు దూరానికి మెట్రిక్ టన్నుకు 462 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. 16 నుంచి 30 కిలోమీటర్ల లోపు 659.30 రూపాయలు, 30 కిలోమీటర్ల పైన ఉంటే అదనంగా 741 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రైతులు తమ పామాయిల్ గెలలను ప్రైవేట్ ఏజెంట్లకు అమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు. రైతులు పండించిన ఆయిల్ పామ్ గెలలను ఆయిల్ ఫెడ్ సంస్థకు సరఫరా చేసి తగిన గిట్టుబాటు ధర పొందాలని వివరించారు.
ఇదీ చదవండీ... 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: జగన్