ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రివర్స్ టెండరింగ్... నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర ప్రజల జీవనాడీ... పోలవరం పనుల్లో అంచనాలు పెరిగాయని భావించిన వైకాపా ప్రభుత్వం.. ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం హెడ్ వర్క్స్‌తో పాటు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం 4 వేల 987.5 కోట్ల రూపాయల పనులకు రివర్స్ టెండరింగ్ పేరిట బిడ్‌లను ఆహ్వానించింది.

రివర్స్ టెండరింగ్... నోటిఫికేషన్ విడుదల

By

Published : Aug 18, 2019, 5:53 AM IST

రివర్స్ టెండరింగ్... నోటిఫికేషన్ విడుదల

పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్తే పనుల్లో జాప్యం జరిగే అవకాశముందని... అంచనాలు పెరిగే సూచనలు ఉన్నాయని పీపీఏ ప్రభుత్వానికి లేఖరాసిన మరుసటి రోజే... ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 4వేల 987.5 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండరింగ్​కు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో రూ.3600 కోట్ల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్​కు వెళ్లాలని నిర్ణయించిన ప్రభుత్వం... దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

పోలవరం ప్రాజెక్టులో హెడ్స్ వర్క్ మిగిలిన పనులకు రూ.1,887.5 కోట్లు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం రూ.3,100 కోట్లు కలిపి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇనీషియల్ బెంచ్ మార్క్ కింద 4,987.5 కోట్లుగా నిర్ణయించి నోటిఫికేషన్ ద్వారా తాజా బిడ్లను ఆహ్వానించారు. పోలవరం ఎడమ కాలువలో 65వ ప్యాకేజీకి సంబంధించి పనులకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్ విడుదలైంది. రూ.275 కోట్ల అంచనాలతో రివర్స్ టెండరింగ్‌కు ఆహ్వనించారు. పోలవరంలో మిగిలిన కాంక్రీట్ పనులు, కాఫర్ డ్యాం పనులకు సంబందించి రూ.1887.5 కోట్లు, హైడల్ ప్రాజెక్ట్​కు సంబంధించి రూ.3100 కోట్లకు రీటెండర్లు ఆహ్వానించింది.

ఈ నోటిఫికేషన్‌ను ప్రస్తుతం ఈ-టెండరింగ్ వెబ్​సైట్​లో అప్​లోడ్ చేసిన జలవనరుల శాఖ... ఇది ఈనెల 19నుంచి అందుబాటులో ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఈ రివర్స్ టెండరింగ్​కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశామని... పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ప్రభుత్వం తరపు నుంచి సమాధానం పంపుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్ ట్రాయ్ సంస్థ జాప్యం చేస్తుండటంతో... 2018లో 60సి నిబంధన కింద నవయుగ సంస్థకు పనులు అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, జల విద్యుత్ ప్రాజెక్టు పనులు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల కోసం మూడు వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి.

రూ.1,244 కోట్లతో ఒకటి, రూ.918 కోట్లతో మరోకటి, రూ.751 కోట్లతో నిర్మాణానికి మూడు దఫాలుగా ఒప్పందం కుదిరింది. అదే సమయంలో స్పిల్ వేపై క్రస్ట్ గేట్ల బిగింపు కోసం ఫ్రాన్స్‌కు చెందిన బెకమ్ సంస్థతో రూ.388 కోట్ల పనులకు ఒప్పందం చేసుకున్నారు. అయితే నిపుణల కమిటీ నివేదిక ఆదారంగా జులై 29న ఈ పనులన్నింటనీ ప్రీ క్లోజర్ పేరుతో రద్దు చేశారు. నవయుగ, బెకమ్ సంస్థలు కలిసి మొత్తంగా రూ.3302 కోట్ల విలువైన పనుల్లో 40శాతం మేర పూర్తి చేశాయి. మిగిలిన పనులకు గానూ ఇప్పుడు రివర్స్ టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియను అక్టోబరులోపే పూర్తిచేసి నవంబరు 1నుంచి పనులు మొదలుపెడతామని రాష్ట్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ...

కృష్ణా నది వరదలపై ఫోన్​లో సీఎం ఆరా

ABOUT THE AUTHOR

...view details