ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఏసీలు ఆపేయండి' - ని ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ తాజా వార్తలు

సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు ఆపేయాలని ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ విద్యుత్తు వినియోగదారుల్ని కోరారు. ‘రాష్ట్రంలో విద్యుత్తు డిమాండు, సరఫరాల మధ్య అంతరం ఉంది. మూడు రోజులుగా రద్దీ సమయాల్లో కొన్నిచోట్ల కోతలు అమలవుతున్నాయి.

government-power-saving-measures-in-ap
'సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఏసీలు ఆపేయండి'

By

Published : Oct 10, 2021, 8:13 AM IST

సాయంత్రం సమయంలో అధిక ధరపై విద్యుత్తు కొనుగోలుకయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి... భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఇలా చేయాలని ప్రజలను కోరుతున్నాం’ అని తెలిపారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ భవనంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు డిమాండు 20% పెరిగింది. కొవిడ్‌కు ముందు అక్టోబరులో రోజుకు 160 మిలియన్‌ యూనిట్ల డిమాండు ఉండగా ఇప్పుడు 195 మిలియన్‌ యూనిట్లు అవసరం అవుతోంది.

బొగ్గు కొరత కారణంగా థర్మల్‌ ప్లాంట్లలో 40 మిలియన్‌ యూనిట్ల మేర ఉత్పత్తి తగ్గింది. పవన విద్యుత్తు రెండు, మూడు మిలియన్‌ యూనిట్లకు మించి రావడం లేదు. దీన్ని తట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏసీలు ఆపేయడం ద్వారా 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుంది’ అని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో ఒకట్రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో... శుక్రవారం నుంచి అయిదు ర్యాక్‌ల బొగ్గు అందుబాటులోకి వచ్చింది’ అని వివరించారు. ‘డిమాండు పెరగడంతో నెల నుంచి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు రేట్లు భారీగా పెరిగాయి. సెప్టెంబరు 16న యూనిట్‌కు రూ.4.60 ఉన్న ధర క్రమంగా పెరుగుతూ నెలాఖరుకు రూ.9.40, ఈనెల ఆరో తేదీ నాటికి రూ.14 అయింది. డబ్బు పెట్టినా విద్యుత్తు దొరకడం లేదు. దేశవ్యాప్తంగా డిమాండు, సరఫరాకు మధ్య రెండు వేల మెగావాట్ల వ్యత్యాసం ఉంది’ అని వివరించారు.

ప్రభుత్వ విధానం మేరకే సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు: రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకే 10 వేల మెగావాట్ల మేర సౌర, పవన విద్యుత్తు సామర్థ్యం పెంచాలని నిర్ణయించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఎనిమిది వేల మెగావాట్ల సౌర, వాయు విద్యుత్తు ఉత్పత్తి ఒప్పందాలను తప్పు పట్టిన ఈ ప్రభుత్వం... ఇప్పుడు 10 వేల మెగావాట్లకు ఎలా ఒప్పందాలు చేసుకుంటుందనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపేసి... బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయడం తదితర అంశాల్లో ప్రభుత్వం అనుసరించిన వ్యూహం వికటించిందని భావిస్తున్నారా? అని విలేకరులు ప్రకటించగా.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే కొంటామని స్పష్టంచేశారు. సర్దుబాటు ఛార్జీల అంశాన్ని విద్యుత్తు నియంత్రణ సంస్థ చూస్తుందని శ్రీకాంత్‌ తెలిపారు. వచ్చే నెలలో వసూలుకు సంబంధించిన నిర్ణయమూ వారే తీసుకుంటారు, పంపిణీ సంస్థల వారీగా వేర్వేరు ధరల విషయమూ వారి నిర్ణయం మేరకే ఉంటుందన్నారు.

ఇదీ చూడండి:HC chief justice: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details