గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాయిదా పద్ధతిన స్వచ్ఛందంగా ఉద్యోగులే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సెల్ సంస్థలు రాయితీ ఇస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ELECTRIC SCOOTERS: ప్రభుత్వ ఉద్యోగులకు.. రాయితీతో ఎలక్ట్రిక్ స్కూటర్లు - ap governament latest updates
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ప్రాతిపదికన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాహనాల కొనుగోలుకు సంబంధించి ఎన్టీపీసీ సహా ఎస్సైల్ సంస్థలు రాయితీ ఇస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి అందించదని పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి అందించదని ప్రభుత్వం పేర్కొంది. వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగుల వేతనాల నుంచి నెలవారీగా వాయిదాలను వసూలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించి సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నెలకు 2500 రూపాయల వరకూ వాయిదా మొత్తాన్ని 3 నుంచి 4 ఏళ్లపాటు చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగులు స్వచ్చందంగానే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: