ఏపీ వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - govt orders to formation of AP Agricultural Council
20:28 April 08
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
Orders to formation of AP Agricultural Council: రాష్ట్రంలో వ్యవసాయ విద్యను నియంత్రించే లక్ష్యంతో ఏపీ వ్యవసాయ మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విద్యా సంస్థల్లో విద్యా సంబంధ వ్యవహారాల్ని నియంత్రించే అధికారం వ్యవసాయ మండలికి ఉంటుంది.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ ఎన్.త్రిమూర్తులు అధ్యక్షుడిగా కౌన్సిల్ అడ్ హక్ కమిటీని నియమించారు. ఈ కమిటీలో మరో 21మంది సభ్యులు, 9మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. వ్యవసాయ, అనుబంధ శాఖల్లో పదవీ విరమణ పొందిన, ప్రస్తుతం పని చేస్తున్న అధికారులతో పాటు... కొందరు ఉద్యోగ సంఘాల నేతలకూ కమిటీలో చోటు కల్పించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 57 మంది జిల్లా, అదనపు జిల్లా జడ్జీల బదిలీ