ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

By

Published : Mar 27, 2021, 9:02 AM IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ, పట్టణ స్థానిక, పంచాయతీరాజ్‌ సంస్థల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్‌/స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

government orders to arrange prepaid electric meters in al government offices
ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ, పట్టణ స్థానిక, పంచాయతీరాజ్‌ సంస్థల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్‌/స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో రెండో విడత కింద డిస్కంలకు నిధులు విడుదల చేయటానికి 2022 మార్చి నాటికి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయాలన్న నిబంధనను కేంద్రం విధించింది. మీటర్ల ఏర్పాటుకు అయ్యే వ్యయాన్ని 2 శాతం వంతున ప్రతినెలా విద్యుత్‌ బిల్లుతో కలిపి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:'మే 3 నుంచి రోజువారి విచారణకు ధర్మాసనం నిర్ణయం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details