Holidays in 2022: తెలంగాణలోలో దుకాణాలు, సంస్థల చట్టం కింద వచ్చే ఏడాది తొమ్మిది పర్వదినాలు, ముఖ్యమైన రోజులను వేతనంతో కూడిన సెలవులుగా కార్మికశాఖ నోటిఫై చేసింది. సంక్రాంతి (జనవరి 15), గణతంత్ర దినోత్సవం (జనవరి 26), మహాశివరాత్రి మరుసటి రోజు (మార్చి 2), మే డే (మే 1), రంజాన్ (మే 3), తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్ 2), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబరు 2), దసరా (అక్టోబరు 5)లను వేతనంతో కూడిన సెలవులుగా పేర్కొంటూ కార్మికశాఖ సంయుక్త కమిషనర్ ఎల్.చతుర్వేది ఉత్తర్వులు జారీ చేశారు.
Government Of Telangana Holiday List 2022: తెలంగాణలో 2022 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవుల (holidays in 2022)పై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government Holiday List 2022) ఉత్తర్వులు (జీవో నంబరు 2618, 2619) జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులు (2022 Public Holiday list )గా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్) 23గా నిర్ధారిస్తున్నట్లు శుక్రవారం ఉత్వర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక అయిదు ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.