తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ నోటీసులు జారీ చేశారు. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
DVC trust: డీవీసీ ట్రస్టుపై ప్రభుత్వం కన్ను.. ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు - dvp trust issues latest news
దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు.. ప్రభుత్వం తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
![DVC trust: డీవీసీ ట్రస్టుపై ప్రభుత్వం కన్ను.. ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు government notice to dhulipalla narendra on DVP trust](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13469019-478-13469019-1635318881878.jpg)
government notice to dhulipalla narendra on DVP trust
ప్రస్తుతం డీవీసీ ట్రస్టు ద్వారా డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. పాలరైతుల కుటుంబ సభ్యులకు 50శాతం రాయితితో వైద్యం అందిస్తూ.. ఈ ఆసుపత్రి పేరు గాంచింది. గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసి న్యాయస్థానం జోక్యంతో వెనక్కు తగ్గింది. తాజాగా డీవీసీ ట్రస్ట్, డీవీసీ ఆస్పత్రికి మళ్లీ నోటీసుల పర్వం మొదలైంది.
ఇదీ చదవండి:
TIRUPATHI AIRPORT: ప్రైవేటుకు తిరుపతి ఎయిర్‌పోర్టు..తర్వాత విజయవాడ, రాజమహేంద్రవరం
Last Updated : Oct 27, 2021, 1:03 PM IST