ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రామ సచివాలయ ఉద్యోగం.. మహిళలకే సగం

గ్రామ, వార్డు సచివాలయాల నియామకంలో మహిళలకు పెద్దపీట వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 60వేలకు పైగా పోస్టులు కేటాయించారు. మళ్లీ ఇంత పెద్ద ఎత్తున అవకాశం రాదనే ఉద్దేశంతో మహిళలంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు.

jobs

By

Published : Aug 2, 2019, 10:26 AM IST

గ్రామ సచివాలయ ఉద్యోగం- మహిళలకే సగం

గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించారు. అన్నింట్లోనూ మహిళల కోసం ప్రత్యేక పోస్టులు కేటాయించారు. డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేసే కేటగిరీ-1లో మొత్తం నాలుగు విభాగాలుండగా... వాటిలో కేవలం మహిళల కోసమే.. మహిళా పోలీసు, స్త్రీ, శిశు సంక్షేమ సహాయకురాలు, మహిళా, బలహీన వర్గాల భద్రతా వార్డు కార్యదర్శి పోస్టులున్నాయి. ఈ విభాగాలలో మొత్తం 14వేల 944 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ-1లోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5 కింద 7వేల 40 పోస్టులు ఉండగా అందులో మహిళలకు 2వేల 371 కేటాయించారు. 3వేల307 వార్డు పరిపాలనా కార్యదర్శి పోస్టులకు 11వందల82 కేటాయించారు. ఇలా వివిధ విభాగాలు కలుపుకుని కేటగిరీ-1లో మహిళల కోసం 22వేల 244 పోస్టులు కేటాయించారు.

రెండో కేటగిరీలోని... 11వేల 158 ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్ 2 పోస్టులకు 3వేల 747.... 3వేల601 వార్డ్‌ ఎమినిటీస్‌ కార్యదర్శి గ్రేడ్‌2 పోస్టులకు 12వందల 86... 2వేల 880 వీఆర్​ఓ పోస్టులకు 973...11వేల158 విలేజ్ సర్వేయర్ల పోస్టులకు 3వేల 738 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఈ కేటగిరీలో మొత్తం మహిళల కోసం 9744 పోస్టులు ఉన్నాయి.

మూడో విభాగంలోని గ్రామ సచివాలయాల్లో 13వేల540 ఏఎన్​ఎం పోస్టులను పూర్తిగా మహిళలతో భర్తీ చేయనున్నారు. 2వేల 314 గ్రామ వ్యవసాయ సహాయకులు... 3వేల 52 పశుసంవర్థక శాఖ సహాయకులు, 3వేల 747 పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు మహిళల కోసం కేటాయించారు. ఇలా వివిధ విభాగాలు కలుపుకుని... కేటగిరీ-3లో మహిళల కోసం మొత్తం 29వేల 976 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీలు కలుపుకుని 60వేలకుపైగా పోస్టులు మహిళలకు కేటాయించటంతో అభ్యర్థులు ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడూ ఉద్యోగం రాదనే దృక్పథంతో మహిళా అభ్యర్థులు పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details