ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెప్టెంబరు వరకు వ్యాక్సిన్ లేదనడం ప్రభుత్వ అసమర్థత: అచ్చెన్న - Atchannaidu comments on YCP

ప్రభుత్వంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబరు వరకు వ్యాక్సిన్ లేదనడం ప్రభుత్వ అసమర్థత అని విమర్శించారు. కేరళ ప్రభుత్వం కోటి టీకాలు ఆర్డర్‌ చేసిందని.. ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల లోపువారు 2.04 కోట్ల మంది ఉన్నారని అంచనా వేశారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

By

Published : May 1, 2021, 8:51 PM IST

రాష్ట్రంలో సెప్టెంబరు వరకు వ్యాక్సిన్ లేదనడం ప్రభుత్వ అసమర్థతే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల లోపువారు 2.04 కోట్ల మంది ఉన్నారని వివరించారు.

కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌ ముమ్మరం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తమిళనాడు తొలి దశలో 1.5 కోట్ల టీకాలు ఆర్డర్ చేసిందన్న అచ్చెన్న... కేరళ కోటి టీకాలు ఆర్డర్‌ చేసిందని.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details