ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagananna Vidya Deevena: 10 రోజుల్లో ఆదారాలివ్వండి... లేకుంటే..! - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెనకు కొందరు అనర్హులుగా తేలారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. 10 రోజుల్లోగా అర్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని తెలిపింది. లేదంటే దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరిస్తామని నోటీసుల్లో పేర్కొంది.

Jagananna Vidya Deevena in ap
జగనన్న విద్యాదీవెన

By

Published : May 2, 2022, 9:01 AM IST

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన పథకం కింద బోధనా రుసుముల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు అనర్హులుగా తేలారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పరిధికి మించి ఇంటి విస్తీర్ణం కలిగి ఉన్నారని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని.. ఆదాయ పన్ను చెల్లింపుదారులున్నారని, తదితర కారణాలతో దరఖాస్తుదారుల పేరు మీద అధికారులు వీటిని జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సచివాలయాల వారీగా పంపారు.

విద్యార్థులు అందుబాటులో లేనిపక్షంలో వారి తల్లిదండ్రులకు నోటీసులు అందించి.. వారి సంతకం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆ పత్రాన్ని తిరిగి నవశకం లాగిన్‌లో అప్​లోడ్ చేయాలని సూచించారు. 10 రోజుల్లోగా అర్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని,.. లేకపోతే దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరిస్తామని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details