మే నెలలో రంజాన్ సందర్భంగా.. కరోనా విషయమై జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదులు, ఈద్గాల్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. మసీదుల్లోకి వచ్చే వ్యక్తులు తప్పని సరిగా మాస్కులను ధరించాలని సూచన జారీ చేసింది.
ప్రార్ధనా స్థలాల్లో శానిటైజేషన్, భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. కరచలనాలు, ఆలింగనాలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోరింది. వృద్ధులు, చిన్నారులు, కరోనా లక్షణాలున్న వారిని ప్రార్ధనా మందిరాల్లోకి అనుమతించొద్దని ప్రభుత్వం పేర్కొంది.