రాష్ట్రంలో కొవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కాల్ సెంటర్ సేవల్ని మరింత విస్తృతం చేసింది. గతంలో ఏర్పాటు చేసిన కొవిడ్ టోల్ ఫ్రీ సెంటర్ 104 తో పాటు ఇతర కంట్రోల్ రూమ్ నెంబర్లు, సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదించాల్సిన వేదికలనూ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కొవిడ్ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబరు-104 (ఆరోగ్యసలహాలు, ఫిర్యాదులు చేసే అవకాశముంది. ఇక రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబరు 0866-241098 ద్వారానూ అత్యవసర సమయాల్లో సంప్రదించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐవీఆర్ఎస్ ద్వారానూ 8297104104 నెంబరు ద్వారానూ కొవిడ్ సమాచారం అందుతుందని ప్రకటించింది. 8297104104 వాట్సప్ చాట్ బోట్ ద్వారానూ కోవిడ్19కి సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. https://esanjeevani.com/ వెబ్ సైట్ ద్వారానూ వీడియోకాల్ చేసి డాక్టర్ను సంప్రదించే అవకాశం కల్పించారు.
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కోవిడ్ 19 ఏపీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని సమాచారం తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆరోగ్యాంధ్ర ట్విటర్, ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారానూ వైద్యారోగ్యశాఖను సంప్రదించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 104 టోల్ ఫ్రీనెంబరు ద్వారానే టెలిమెడిసిన్కు కూడా అవకాశం కల్పించినట్టు వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. యధావిధిగా అంబులెన్స్ సేవల నెంబర్ 108 పని చేస్తుందని స్పష్టం చేసింది. 104 కాల్ సెంటర్కు ఫోన్ చేసినా ఈ సేవల్ని పొందే అవకాశముందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.