ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మంత్రి అప్పలరాజుకు అదనపు శాఖలు...అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిర్ణయం - రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార శాఖల మంత్రి

Minister Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం అదనంగా మరిన్ని శాఖలు కేటాయించింది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం దగ్గర ఉన్న వివిధ శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు.

Minister Appalaraju
అప్పలరాజుకు అదనపు బాధ్యతలు

By

Published : Mar 3, 2022, 12:34 PM IST

Minister Appalaraju: రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార శాఖల మంత్రి సీదిరి అప్పలరాజుకు మరిన్ని శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా సమాచార సాంకేతికత, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖలను కేటాయించారు. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వివిధ శాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. దీనిలో ఎక్కువ శాఖల బాధ్యతలను మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details