ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాలంటీర్ల ఖాళీల భర్తీకి ఉత్తర్వులు - ap government latest volunteers go

వాలంటీర్ల ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం నోటిఫికేషన్​ విడుదల కానుంది. అర్హుల నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 25 న పరిశీలించి... అనంతరం ముఖాముఖి నిర్వహించి మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

government gave GO for recruiting volunteer posts
వాలంటీర్ల పోస్టులకు ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Apr 19, 2020, 6:45 AM IST

గ్రామ, వార్డు వాలంటీర్ల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వాలంటీర్ల నియామకాల సందర్భంగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్లు తదుపరి చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు వాలంటీర్ల, సచివాలయ విభాగ ప్రత్యేక కార్యదర్శి కె. కన్నబాబు శనివారం సూచించారు. కొవిడ్​-19 నియంత్రణ కార్యక్రమాలకు గైర్హాజరైన వారితోపాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించి ఈ నెల 20న నోటిఫికేషన్​ జారీ చేస్తారు. 24లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. 27-29 తేదీల మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

  • 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు పూర్తయి 35 ఏళ్ల నిండని వారంతా ఆన్​లైన్​లో సంబంధిత వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఖాళీల భర్తీలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్​ అమలు చేస్తారు. మిగతా యాభై శాతం పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తూ రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​ (ఆర్​వోఆర్​) అమలు చేయనున్నారు.
  • ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై పరిజ్ఞానం, అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలులో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తికరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.

ABOUT THE AUTHOR

...view details