సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి ఏడాదికి పదివేలు సాయం చేసే పథకానికి సంబంధించి ఈనెల 10 నుంచే ఆన్ లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గడువును 12వ తేది వరకు పొడగించినట్లు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి టి.కృష్ణబాబు తెలిపారు. పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన నిబంధలను మరింత సరళీకరిస్తున్నామని, లబ్దిదారులు ఆందోళన చెందవద్దని కృష్ణబాబు వెల్లడించారు.
ఆటోవాలాల దరఖాస్తులకు ముహుర్తం ఖరారు - auto
రాష్ట్ర ప్రభుత్వం ఆటో, టాక్సీ వాలలకు ఇచ్చిన వాగ్దనాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది.
ఈ నెల 12నుంచి ఆటోవాలల దరఖాస్తులను స్వీకరించనున్న ప్రభుత్వం