ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హామీ ఇచ్చినందు వల్లే ఆందోళన విరమించాం: జూడాల - ఏపీలో వేతనాల పెంపుపై డాక్టర్లు నిరసన

పీఆర్సీ అమలుపై తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి నిధుల కేటాయింపు విషయమై ఆర్ధిక శాఖతో వైద్య ఆరోగ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వేతనాల పెంపుపై నిర్ణయాన్ని తీసుకున్న రోజు నుంచే వేతనాల పెంపు అమలుచేస్తామని ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖకు స్పష్టంచేసింది.డిమాండు పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి రాతపూర్వకంగా హామీ ఇచ్చినందున.. ఆందోళన కార్యక్రమాలు విరమించినట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది.

government doctors
government doctors

By

Published : Aug 27, 2020, 7:24 AM IST

దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న యూజీసీ పీఆర్సీ 2016 ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు చెల్లించే విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పీఆర్సీ అమలుపై తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి నిధుల కేటాయింపు విషయమై ఆర్ధిక శాఖతో వైద్య ఆరోగ్య శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వేతనాల పెంపుపై నిర్ణయాన్ని తీసుకున్న రోజు నుంచే వేతనాల పెంపు అమలుచేస్తామని ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖకు స్పష్టంచేసింది.

ఈ అంశంపై అధికారుల మధ్య తాజాగా చర్చలు జరిగాయి. అయితే .. 2016 నుంచి పీఆర్సీ అమలు చేయకుంటే తీవ్రంగా నష్టపోతామని ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు. పీఆర్సీ అమలుచేస్తే 'బేసిక్ పే ' రెండింతలు పెరిగే అవకాశం ఉంది. వేతనాల పెంపువల్ల 300 కోట్ల రూపాయల వరకు ఏడాదికి అదనంగా నిధులు అవసరం అవుతాయి . అపరిష్కృత డిమాండు పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి రాతపూర్వకంగా హామీ ఇచ్చినందున.. ఆందోళన కార్యక్రమాలు విరమించినట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డాక్టర్ జయధీర్ తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details