ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MEO POSTS : రాష్ట్రంలో కొత్తగా ఎంఈవో పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. - new meo posts in ap

NEW MEO POSTS IN AP : రాష్ట్రంలో కొత్తగా ఎంఈవో పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈవో-1 పేరిట 13, ఎంఈవో-2 పేరిట కొత్తగా 679 పోస్టులు భర్తీ చేయనున్నారు.

NEO MEO POSTS IN AP
NEO MEO POSTS IN AP

By

Published : Sep 17, 2022, 3:35 PM IST

NEW MEO POSTS : రాష్ట్రంలో కొత్తగా ఎంఈవో పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈవో-1 పేరిట 13 పోస్టులు, ఎంఈవో-2 పేరిట 679 పోస్టులను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్యాశాఖలో బోధన, బోధనేతర అంశాల పర్యవేక్షణకు గానూ కొత్త పోస్టులను కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

ప్రస్తుతం ఉన్న 666 ఎంఈవో పోస్టులకు అదనంగా 13 కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే 679 ఎంఈఓ 2 పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక నుంచి ప్రతీ మండలంలోనూ ఇద్దరు ఎంఈవోలు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇక నుంచి ఎంఈవో 1 గా మార్పు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details