గ్రేటర్ రాయలసీమ ప్రయోజనాలు కోసమే సీఎం జగన్ ఆలోచిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(SrikanthReddy) తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను రాయలసీమలోని అన్నీ ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూర్చోని మాట్లడేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ తెలంగాణ నేతల నుంచే ఎలాంటి స్పందన రావటం లేదన్నారు. నీటి వాటాలపై స్పష్టత వస్తే మాట్లాడుకునేందుకు సిద్ధమన్నారు. సాగు నీటిని అదనంగా వాడుకోవాలనే యోచన తమకు లేదని స్పష్టం చేశారు.
SrikanthReddy: తెలంగాణ నేతలు స్పందించడం లేదు : శ్రీకాంత్‌రెడ్డి - నీటీ వాటాలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందన
ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(SrikanthReddy) తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కానీ తెలంగాణ నేతల నుంచే ఎలాంటి స్పందన లేదన్నారు.
శ్రీకాంత్‌రెడ్డి