రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణంగా జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ తెదేపా నేత వర్ల రామయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 200కు సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు, పదవి నుంచి తొలగిస్తూ ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరారు. రాజ్యాంగ నిర్మాతలు రాజకీయ ప్రభావానికి తావు లేకుండా ఎన్నికల సంఘానికి స్వతంత్రతను ఇచ్చారని.. ప్రస్తుత అధికార పార్టీ దురుద్దేశంతో వ్యవస్థను మలినం చేస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని వర్ల రామయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అధికరణ 243(కే) ప్రకారం ఎస్‌ఈసీ ఒకసారి నియమితులయ్యాక సర్వీసు నిబంధనలను అనుసరించాల్సిందేనని... పదవీకాలాన్ని మార్చేందుకు వీల్లేదని వర్ల తెలిపారు. రమేశ్ కుమార్‌ను తొలగించేందుకు దురుద్దేశంతో ఏకపక్షంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని వర్ల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికారపార్టీ వారు ఎన్నికల కమిషనర్‌ను భయపెట్టి దాడి చేసే స్థాయికి వెళ్లినందువల్ల ఎస్‌ఈసీ కేంద్రప్రభుత్వం నుంచి రక్షణ కోరిన విషయాన్ని వర్ల రామయ్య గుర్తుచేశారు. కేవలం రాజకీయ కారణంతో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందువల్ల... ఆర్డినెన్స్, సంబంధిత జీవోలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి వాటి అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్ల రామయ్య తన వ్యాజ్యంలో కోరారు. సాధారణ పరిపాలనశాఖ, పంచాయతీరాజ్‌శాఖ, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదుల జాబితాలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిల్