ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధిస్తూ మత్స్యశాఖ ఉత్తర్వులు - ప్రభుత్వం ఉత్తర్వులు తాజా వార్తలు

సముద్ర తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేదిస్తున్నట్లు మత్స్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటకు నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రభుత్వం నిర్దేశించిన 61 రోజుల పాటు చేపల వేటకు వెళ్లరాదని ప్రకటనలో పేర్కొంది.

bans fishing in andhra pradesh
చేపల వేటను నిషేదించిన ప్రభుత్వం

By

Published : Apr 9, 2021, 1:51 AM IST

రాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 తేదీ వరకూ చేపల వేటపై నిషేధం విధిస్తూ.. నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు మత్స్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. మెకనైజ్డ్ బోట్లు, మోటారు బోట్లు , ఇతర ఇంజిన్ బిగించిన బోట్లు.. ప్రభుత్వం నిర్దేశించిన 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొంది. భారత తూర్పు తీర ప్రాంతంలోని అండమాన్ నికోబార్ సహా ప్రత్యేక ఆర్థిక జోన్ లో చేపల వేటను నిషేధిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

దేశ వ్యాప్తంగా తూర్పు, పశ్చిమ సముద్ర తీర ప్రాంతాల్లో చేపల సంతానోత్పత్తి, సంరక్షణ రీత్యా ఈ నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పశ్చిమ తీర ప్రాంతంలో జూన్ 1 తేదీ నుంచి జులై 31 తేదీ వరకు నిషేధం విధించారని ప్రభుత్వం పేర్కొంది. సంప్రదాయ బోట్లకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details