ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

63 సంస్థలు, వ్యక్తులకు వైఎస్సార్‌ పురస్కారాలు

వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రకటించిన ప్రభుత్వం పురస్కారాలకు ఇవ్వనున్న రివార్డును ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లైఫ్ టైమ్ అచీవ్మెెంట్ అవార్డుకు 10 లక్షల చొప్పున అచీవ్మెెంట్ అవార్డుకు 5 లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారం ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 31 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు, 32 అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

YSR Achievement Awards
వైఎస్సార్‌ పురస్కారాలు

By

Published : Jul 8, 2021, 5:46 AM IST

వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, కళాకారులకు వైఎస్సార్‌ జీవిత సాఫల్య (లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌), సాఫల్య (అచీవ్‌మెంట్‌) పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 31 జీవిత సాఫల్య, 32 సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. ఈ వివరాలను ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ఏడాది కొవిడ్‌ కారణంగా అవార్డులు ప్రకటించలేకపోయామన్నారు. జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షలు, సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షలు, జ్ఞాపిక అందజేసి, సత్కరించనున్నట్లు చెప్పారు. ప్రదానోత్సవం ఆగస్టు 14న లేదా 15 ఉండవచ్చన్నారు.

వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాలు...
* సంస్థలు:ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ట్రస్ట్‌ (కాకినాడ), సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం (కడప), సారస్వత నికేతన్‌ గ్రంథాలయం (వేటపాలెం, ప్రకాశం జిల్లా), శ్రీసత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ (అనంతపురం), ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌(కడప), రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌డీటీ- అనంతపురం), గౌతమి ప్రాంతీయ గ్రంథాలయం (రాజమహేంద్రవరం), మహారాజాస్‌ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ (విజయనగరం)

* రైతులు: కడియం నర్సరీల వ్యవస్థాపకుడు దివంగత పల్లా వెంకన్న

* కళాకారులు:ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం (పొందూరు వస్త్రాలు- శ్రీకాకుళం), దివంగత వంగపండు ప్రసాదరావు (జానపదగేయం - విజయనగరం), అచ్యుత నారాయణ (బొబ్బిలివీణ- విజయనగరం), పొన్నాల రామసుబ్బారెడ్డి (రంగస్థలం - నెల్లూరు), శ్రీవినాయక నాట్యమండలి (సురభి నాటకం- కడప), దాలవాయి చలపతి (తోలుబొమ్మలు - అనంతపురం), సిద్ధేంద్రయోగి కళాక్షేత్రం (కూచిపూడి నాట్యం - కృష్ణా జిల్లా).

* రచయితలు:దివంగత కాళిపట్నం రామారావు (శ్రీకాకుళం), కత్తి పద్మారావు (అభ్యుదయ సాహిత్యం - గుంటూరు), సాహిత్యంలో.. రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి (కడప), బండి నారాయణస్వామి (అనంతపురం), కేతు విశ్వనాథరెడ్డి (కడప), కొనకలూరి ఇనాక్‌ (గుంటూరు), లలితకుమారి (గుంటూరు).

* పాత్రికేయులు: పాలగుమ్మి సాయినాథ్‌ (చెన్నై), ఏబీకే ప్రసాద్‌ (కృష్ణా), దివంగత పొత్తూరి వెంకటేశ్వరరావు (గుంటూరు), దివంగత షేక్‌ ఖాజాహుస్సేన్‌ (గుంటూరు), దివంగత కె.అమర్‌నాథ్‌ (పశ్చిమగోదావరి), తెలకపల్లి రవి (కర్నూలు), ఇమామ్‌ (అనంతపురం), కార్టూనిస్ట్‌ సురేంద్ర (కడప).

వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలు...
* సంస్థలు:మాతోట ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ (శ్రీకాకుళం), ఎంసీ రామకృష్ణారెడ్డి (అనంతపురం), కొట్యాడ శ్రీనివాసరావు (విజయనగరం), విఘ్నేశ్వర ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (కృష్ణా), ఎం.బలరామిరెడ్డి (కడప), ఎస్‌.రాఘవేంద్ర (చిత్తూరు), సెగ్గె కొండల్‌రావు (విశాఖపట్నం), ఆంధ్ర కశ్మీర్‌ ట్రైబల్‌ ఫార్మింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (విశాఖపట్నం), వల్లూరు రవికుమార్‌ (కృష్ణా), శివ అభిరామరెడ్డి (నెల్లూరు).

* కళాకారులు:కిల్లు జానకమ్మ థింసా నృత్య బృందం (విశాఖపట్నం), సవర రాజు (సవర పెయింటింగ్స్‌- శ్రీకాకుళం), మజ్జి శ్రీనివాసరావు (వీధినాటకం- విశాఖపట్నం), ధర్మాడి సత్యం (విపత్తు నిర్వహణ- తూర్పుగోదావరి), సర్వారాయ హరికథా మహిళ పాఠశాల (హరికథ- తూర్పుగోదావరి), మిరియాల అప్పారావు (బుర్రకథ- పశ్చిమగోదావరి), కూరెళ్ల వెంకటాచారి (కొండపల్లి బొమ్మలు- కృష్ణా), గోచిపాత గాలేబు (డప్పు కళాకారుడు- కృష్ణా), జి.రమణయ్య (వెంకటగిరి జమదానీ చీరలు- నెల్లూరు), శివప్రసాద్‌రెడ్డి (కలంకారి- కర్నూలు), శ్రీబాలజీ ఉడ్‌ కార్వింగ్‌ ఆర్జిజాన్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ (చిత్తూరు), డాక్టర్‌ వి.సత్యనారాయణ (నాదస్వరం- చిత్తూరు), పూసపాటి పరమేశ్వరరాజు (కేలిగ్రఫీ- విజయనగరం).

* కొవిడ్‌ వారియర్స్‌: డాక్టర్‌ నీతిచంద్ర (నెల్లూరు), డాక్టర్‌ కె.కృష్ణకిషోర్‌ (కాకినాడ), లక్ష్మి (స్టాఫ్‌నర్స్‌, జీజీహెచ్‌, విజయవాడ), కె.జ్యోతిర్మయి (స్టాఫ్‌నర్స్‌, అనంతపురం), తురుబిల్లి తేజస్వి (స్టాఫ్‌నర్స్‌, విశాఖ), ఎం.యోబు (మేల్‌నర్సింగ్‌, నెల్లూరు), అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (గుంటూరు), ఆర్తి హోమ్స్‌ (కడప).

తిరస్కరించిన పాలగుమ్మి సాయినాథ్‌
ఈ పురస్కారాన్ని గౌరవంగా తిరస్కరిస్తున్నట్లు పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ట్వీట్‌ చేశారు. ‘పాత్రికేయులు తాము వార్తలు రాసే, విమర్శించే ప్రభుత్వాల నుంచి అవార్డులను అంగీకరించకూడదు. 40 ఏళ్లుగా నేను ప్రభుత్వాల నుంచి ఏ అవార్డు వచ్చినా ఇలాగే తిరస్కరించాను’ అని వివరించారు.

ఇదీ చదవండి:

KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'

Union Cabinet: మోదీ ప్రభుత్వంలో​ మంత్రులు- వారి శాఖలు

ABOUT THE AUTHOR

...view details