NEW LIQUOR POLICY: 2021-22 నూతన మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం - 2021-22 new liquor policy
23:46 October 01
madyam
2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానం(new liquor policy) ప్రకటించింది. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్(notifcaton) ను విడుదల చేసింది. గత సంవత్సరం తరహాలోనే 2,934 దుకాణాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిపాటు ఈ దుకాణాల లైసెన్సులు అమల్లో ఉంటాయని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. గత ఏడాది విడుదల చేసిన మద్యం విధానాన్నే దాదాపు కొనసాగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ బార్గవ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
ఏడాది కాలానికి మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ఉంటుందని ప్రభుత్వం గెజిట్ లో పేర్కోంది. 2021 అక్టోబరు 1 తేదీ నుంచి 2022 సెప్టెంబరు 30 తేదీ వరకూ మద్యం దుకాణాల లైసెన్సులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ రహదారుల వెంట మద్యం విక్రయాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని కొత్త విధానంలో ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గం వరకూ రహదారిపై మద్యం దుకాణాలను, పర్మిట్ రూములను అనుమతించబోమని ప్రభుత్వం గెజిట్ లో స్పష్టం చేసింది. రీటైల్ అవుట్ లెట్ల సంఖ్యలో మార్పు లేకుండా వాకిన్ మద్యం దుకాణాల ఏర్పాటుకు ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ కు అనుమతిస్తున్నట్టు గెజిట్లో ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు మద్యం విక్రయాలు, లావాదేవీల్లో పారదర్శకత కోసం ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని కొనసాగిస్తామని ఎక్సైజు శాఖ తెలియచేసింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ లను కూడా అనుమతిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు టూరిజం కార్పోరేషన్ విజ్ఞాపన మేరకు టూరిజం ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కోన్నారు.
ఇదీ చదవండి: