Acharya Movie: ఈనెల 29న విడుదల కానున్న ఆచార్య సినిమా ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఆచార్య టిక్కెట్ ధరను రూ.50 పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 29 నుంచి పది రోజుల పాటు మాత్రమే కొత్త ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. రూ.100 కోట్ల నిర్మాణ వ్యయం దాటిన చిత్రాలకు టిక్కెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, సంయుక్త కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు తగిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఐదో షో విషయంపై మాత్రం ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.
ఇదీ చదవండి: సారూ... కాళ్లు పట్టుకుంటాం రక్షించండి
'ఆచార్య' సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
!['ఆచార్య' సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి government allowed the Acharya cinema ticket price to increase](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15118054-337-15118054-1650954617911.jpg)
ఆచార్య సినిమా టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి
11:02 April 26
Acharya Movie: ఐదో షో విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
Last Updated : Apr 26, 2022, 12:05 PM IST
TAGGED:
ap latest updates