గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు..ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. తొలిదశలో 51 సచివాలయాల్లో సేవలు అందించాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ల సేవలు అందించేలా..గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వ కార్యాచరణ
18:57 September 23
గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు!
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరించేందుకు..గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ సేవలు ప్రారంభించేలా..ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలివిడతలో 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం..ఎంపిక చేసిన 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో..అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే..ఈ 51 సచివాలయాలను..సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా నోటిఫై చేయాలని..రెవెన్యూ శాఖను ఆదేశించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు.
నవరత్నాల్లో భాగంగా..క్షేత్రస్థాయిలో పౌరసేవల్ని అందించేందుకు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు..రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు..నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రీసర్వే ప్రాజెక్టు తొలిదశ పూర్తైన 51 సచివాలయాల్లో..సేవలు ప్రారంభిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి: