ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. 13 మందిపై ప్రభుత్వం చర్యలు.. - క్రమశిక్షణ

Ibrahimpatnam: తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యాధికారులపై బదిలీ వేటుతో పాటు వైద్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

Ibrahimpatnam Incident
కుంటుంబ నియంత్రణ

By

Published : Sep 24, 2022, 12:29 PM IST

Ibrahimpatnam Incident Latest Update: తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్ సునీల్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. బాధ్యులపై చర్యలతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

గత నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేశారు. వీరిలో నలుగురు మహిళలు ఆపరేషన్​ వికటించి మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి..:

ABOUT THE AUTHOR

...view details