ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్‌సీసీ డైరెక్టరేట్​ను అభినందించిన తెలంగాణ గవర్నర్​ తమిళిసై - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రతిష్టాత్మక బ్యానర్‌ను గెలుచుకున్న ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్​ను గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ప్రశంసించారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎన్​సీసీ క్యాడెట్‌లను సన్మానించారు.

governer-tamilisai-appreciate-to-telangana-ap-ncc-directorate-in-hyderabad
ఎన్‌సీసీ డైరెక్టరేట్​ను అభినందించిన తెలంగాణ గవర్నర్​ తమిళిసై

By

Published : Feb 4, 2021, 2:08 PM IST

దిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కవాతులో నాలుగు పురస్కారాలు పొందిన.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి డైరెక్టరేట్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. బుధవారం రాజ్‌భవన్‌లో పురస్కార గ్రహీతలను ఆమె సన్మానించారు.

ఉత్తమ డైరెక్టరేట్, మార్చింగ్‌ కంటింజెంట్, బెస్ట్ కమాండర్ ఆఫ్ ది కంటింజెంట్, బెస్ట్ కమాండర్ అవార్డులు లభించగా... డైరెక్టరేట్‌కు 12 ఏళ్ల తర్వాత పురస్కారం దక్కినట్లైందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఎయిర్‌ కమాండర్‌ టీఎస్‌ సురేష్‌కృష్ణన్, కర్నల్‌ సుబీర్‌నాగ్‌ సహా 26 మంది సభ్యుల బృందాన్ని గవర్నర్‌ సత్కరించారు.

ఇదీ చదవండి:అమ్మ ఒడి నగదు అడిగినందుకు.. విద్యార్థికి చెంపదెబ్బల శిక్ష!

ABOUT THE AUTHOR

...view details