ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకంపై విధి విధానాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలం ఇవ్వనుంది. పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తెల్ల రేషన్‌కార్డు ఉండి గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు అర్హులుగా పరిగణించనున్నారు. రెండున్నర ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్టభూమి ఉన్నవారికి అర్హత కల్పించనున్నారు. స్థలాల సేకరణ, కొనుగోలుపై సంయుక్త కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పథకం అమలుకు మంత్రులు, అధికారులతో రాష్ట్ర స్థాయిలో రెండు కమిటీలు, జిల్లా స్థాయిలో అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ఇళ్ల స్థలాల పంపిణీ పై విధివిధానాలు జారీ - governament Issuing rules on the distribution of houses
ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలంఇవ్వాలని.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అపార్టుమెంట్లలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పథకం అమలుకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనుంది.
![ఇళ్ల స్థలాల పంపిణీ పై విధివిధానాలు జారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4183111-665-4183111-1566238026956.jpg)
ఇళ్ల స్థలాల పంపిణీ పై విధివిధానాలు జారీ