ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MINISTER KTR: మంత్రి కేటీఆర్​కు ప్రముఖ దర్శకుడి ట్వీట్... అధికారుల రియాక్షన్! - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని రోడ్ల తీరుపై దర్శకుడు గోపిచంద్ మలినేని(GOPI CHANDMALINENI) ట్వీట్ చేశారు. కైతలాపూర్‌లోని ఓ రహదారి వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ను(KTR) ట్యాగ్ చేశారు. దీనిపై మూసాపేట్ డిప్యూటీ కమిషనర్ స్పందించారు.

gopichand-malineni-tweet-about-kukatpally-roads-and-tag-minister-ktr-finally-deputy-commissioner-respond-on-this-tweet
మంత్రి కేటీఆర్​కు ప్రముఖ దర్శకుడి ట్వీట్... అధికారుల రియాక్షన్!

By

Published : Sep 1, 2021, 12:37 PM IST

తెలంగాణలోని హైదరాబాద్ కైతలాపూర్‌లోని రోడ్ల పరిస్థితిని దర్శకుడు గోపిచంద్ మలినేని(GOPI CHAND MALINENI) ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని చీర్స్ ఫౌండేషన్ అనాథాశ్రమం, 600 కుటుంబాలు నివసించే ఓ కాలనీలోని ఆ రహదారులను బాగు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు(KTR) విజ్ఞప్తి చేశారు. గ్రేటర్‌ తెలంగాణ దిశగా తెరాస ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ మేరకు బురదమయంగా ఉన్న రోడ్డు వీడియోను పోస్ట్ చేసి... ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేశారు.

దీనిపై మూసాపేట్ డిప్యూటీ కమిషనర్ కె.రవి కుమార్ స్పందించారు. దర్శకుడు గోపిచంద్ మలినేని ట్వీట్‌పై స్పందించిన డిప్యూటీ కమిషనర్... వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'

ABOUT THE AUTHOR

...view details