'స్పందన' కార్యక్రమానికి భారీగా అర్జీలు - ap
ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఇళ్ల స్థలాలు, ఫించన్లు, రేషన్ కార్డుల కోసం ఎక్కువ అర్జీలు వస్తున్నాయి.
!['స్పందన' కార్యక్రమానికి భారీగా అర్జీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4175800-thumbnail-3x2-spandna.jpg)
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'స్పందన' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌కు వందల సంఖ్యలో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు పెట్టుకునేందుకు తరలివచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన స్పందన కార్యక్రమానికి ఆరు మండలాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. కడప కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు 'స్పందన'కు తరలివచ్చారు. ఇళ్ల స్థలాలు, ఫించన్లు, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్జీదారులకు రశీదులు అందజేశారు.