రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ-2008 అభ్యర్థులు సీఎం జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్న సీఎం... పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. అర్హులకు మినిమం టైం స్కేలుతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆదేశాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు.
2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు గుడ్న్యూస్ - 2008-DSC Latest News
2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది. అర్హులైన 2193 మంది అభ్యర్థులను 21వేల 230 రూపాయల మినిమం టైం స్కేలు ఇచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లుగా నియమించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
డీఎస్సీ-2008 అభ్యర్థులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం లేదని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశం కమిటీ పరిశీలనలో ఉన్న కారణంగా... వారు పనిచేసే స్థానాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా మిగిలిన వాటికి కొత్తగా నియామకాలు ఇవ్వాలని కోరగా... సీఎం అంగీకరించినట్లు తెలిపారు. త్వరలోనే జాబ్ క్యాలండర్ ఇస్తామని సీఎం చెప్పారని వివరించారు. తమకు న్యాయం చేయడంపై ముఖ్యమంత్రికి అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండీ... Junior Doctors : త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు : జూడాలు