దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి (81) చెన్నైలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది. 2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నైలోని కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఆమె ఉంటున్నారు. వయోభారం కారణంగా శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు స్వగృహంలో మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఐదుగురు మనవళ్లు ఉన్నారు.
గొల్లపూడి సతీమణి మృతి
దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి (81) చెన్నైలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది.
గొల్లపూడి సతీమణి మృతి