ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LIVE : దివికెగసిన కళాదిగ్గజం

gollapudi
గొల్లపూడి మారుతీరావు

By

Published : Dec 12, 2019, 2:09 PM IST

Updated : Dec 12, 2019, 3:27 PM IST

15:23 December 12

నారా లోకేశ్ సంతాపం

గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. ఉత్తమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి గొల్లపూడి అని లోకేశ్‌ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. 

15:09 December 12

గొల్లపూడి జీవిత విశేషాలు

గొల్లపూడి మారుతీరావు

రేడియోతో మొదలు పెట్టి..

తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. 
 

14:32 December 12

అంత్యక్రియలు

శనివారం వరకు చెన్నైలోని లైఫ్‌లైన్ ఆస్పత్రిలోనే గొల్లపూడి భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని ఆయన నివాసానికి గొల్లపూడి భౌతికకాయం... తరలించనున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో గొల్లపూడి భౌతికకాయం ఉంచుతారు. విదేశాల నుంచి కుటుంబసభ్యులు రావాల్సి ఉండటంతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు చెన్నైలో నిర్వహించనున్నారు.  

14:16 December 12

గొల్లపూడి మృతిపట్ల సీఎం జగన్ సంతాపం

గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా,సంపాదకునిగా గొల్లపూడి సేవలు ప్రశంసనీయమని సీఎం జగన్ అన్నారు.  గొల్లపూడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

14:13 December 12

గొల్లపూడి మృతిపట్ల చంద్రబాబు సంతాపం

గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు,సాహితీలోకానికి తీరనిలోటని చంద్రబాబు అన్నారు. నటుడిగా,రచయితగా గొల్లపూడి మారుతీరావు సేవలు ప్రశంసనీయమని శ్లాఘించారు.  ఆయన కుటుంబసభ్యులకు,అభిమానులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

13:53 December 12

గొల్లపూడి మారుతీరావు కన్నుమాత

గొల్లపూడి మారుతీరావు ప్రస్థానం

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో నటించి నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు మారుతీరావు. రేడియోతో మొదలుపెట్టి సినిమాల్లో తనదైన శైలిలో రాణించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించిన గొల్లపూడి సంబంధించిన జీవిత విశేషాలు.

ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 
 

Last Updated : Dec 12, 2019, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details