Gold seize in shamshabad: హైదరాబాద్ శివారులోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు సుడాన్ వాసుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. గోల్డ్ బార్స్, పేస్ట్ రూపంలో బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.
Gold seize in shamshabad : ఆర్జీఐఏలో భారీగా బంగారం పట్టివేత - హైదరాబాద్ వార్తలు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నలుగురు సుడాన్ వాసుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
ఆర్జీఐలో భారీగా బంగారం పట్టివేత
వీరి నుంచి రూ.3.60 కోట్లు విలువైన 7.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.