gold seized from woman at Shamshabad airport: అధికారులు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం రవాణా ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి అధికంగా బంగారాన్ని తీసుకొస్తున్న ఓ మహిళ నుంచి కస్టమ్స్ అధికారులు 268.4 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.13.73 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆగని బంగారం అక్రమ రవాణా.. ఈసారి ఎంతంటే..? - Gold seized from woman
Gold seized from woman at Shamshabad airport: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ.. బంగారాన్ని పేస్టు రూపంలో టేపులో ఉంచి వీపునకు అతికించుకుని వస్తుండగా అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.13.73 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం సీజ్
మహిళ బంగారాన్ని పేస్టు రూపంలో టేపులో ఉంచి.. వీపునకు అతికించుకుందని అధికారులు పేర్కొన్నారు. మహిళపై అనుమానంతో తనిఖీలు చేయగా.. బంగారం బయటపడిందన్నారు.
ఇవీ చదవండి: