ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..? - lanke bindelu images

తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందెలు బయటపడ్డాయి. వాటిల్లో భారీ స్థాయిలో బంగారం, వెండి లభించింది.

gold pots
లంకెబిందెలు

By

Published : Apr 8, 2021, 12:59 PM IST

Updated : Apr 8, 2021, 9:10 PM IST

లంకెబిందెలు

తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తిలో బంగారు ఆభరణాలతో నిండిన లంకెబిందెలు బయటపడ్డాయి. హైదరాబాద్​కు చెందిన నర్సింహ పెంబర్తిలో 11 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని వెంచర్​గా మార్చేందుకు చదును చేస్తుండగా బండ రాళ్ల సమీపంలో లంకెబిందె లభ్యం అయ్యింది. దానిలో సుమారు 19 తులాల బంగారం, 1.7 కిలోల వెండి ఉండటంతో నర్సింహ అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు.

ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. లంకెబిందె దొరికిందని తెలియడంతో... దాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆభరణాలు కాకతీయులకాలం నాటివి అని... ఇంకా తవ్వకాలు చేపడితే మరిన్ని గుప్త నిధులు దొరికే అవకాశం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండీ..'ఎమ్మెల్యే ఫేక్ ఎఫ్​బీ క్రియేట్​.. ఆపై డిమాండ్​'

Last Updated : Apr 8, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details