రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద జలాలను బనకచర్ల రెగ్యులేటర్ వద్దకు చేర్చి... అటు రాయలసీమ జిల్లాలకు, ఇటు పెన్నాకు తరలించేలా వీలుగా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వ్యాప్కోస్‌కు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించారు. గోదావరి-బనకచర్ల అనుసంధానానికి నీరు మళ్లింపు మార్గాలపై వ్యాప్కోస్ అయిదు ప్రత్యామ్నాయాలతో ప్రాథమిక నివేదిక రూపొందించి తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. అయిదో ప్రత్యామ్నాయంలో భాగంగా మూడు వేర్వేరు ప్రతిపాదనలు కూడా చేసింది.
ఈ వారంలో ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఈ అంశంపై సమీక్షించనున్నారని సమాచారం. సీఎం అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాక తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. వీలైనంత త్వరగా డీపీఆర్ పూర్తి చేసి టెండర్లు పిలవాలని జలవనరులశాఖ భావిస్తోంది. గోదావరి నీటిని కృష్ణాలో కలుపుతూ మళ్లించేలా కొన్ని ప్రత్యామ్నాయాలు, కృష్ణా నదిలో కలవకుండానే అక్విడక్టు నిర్మించి నేరుగా బనకచర్లకు మళ్లించేలా కొన్ని ప్రత్యామ్నాయాలను వ్యాప్కోస్ సూచించింది.
ప్రత్యామ్నాయం
1: కృష్ణా నదిలో కలపకుండానే బనకచర్లకు మళ్లింపు
గోదావరి నుంచి వరద కాలంలో టన్నెళ్లు, గ్రావిటీ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. కృష్ణా నదిపై చింతపల్లి వద్ద అక్విడక్టు నిర్మించి అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించి తరలిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు మళ్లిస్తారు. ఈ మార్గంలో టన్నెల్ నిర్మాణమూ అవసరమవుతుంది. ఆరు చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలో మొత్తం 560 కిలోమీటర్ల మేర నీటిని తరలిస్తారు. 9,149 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం అవుతుంది.
- అంచనా వ్యయం: రూ.61,302 కోట్లు (రోజుకు 2 టీఎంసీలు తరలిస్తే), రూ. 68,924 కోట్లు (రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే).
2: కృష్ణా నదిలో కలపకుండా సాగర్ కుడి కాలువ సాయంతో మళ్లింపు
గోదావరి నుంచి కృష్ణా నదిని దాటే వరకు తొలి ప్రతిపాదన తరహాలోనే నీటి మళ్లింపు ఉంటుంది. వైకుంఠపురం బ్యారేజి ప్రాంతానికి ఎగువన అక్విడక్టు నిర్మించి నీటిని దాటిస్తారు. ఈ ప్రాంతం నుంచి గోదావరి వరద నీటిని ప్రస్తుతం ఉన్న సాగర్ కుడి కాలువకు మళ్లిస్తారు. ఎత్తిపోతల పథకాలు, గ్రావిటీ కాలువ ద్వారా తరలింపు ఉంటుంది. అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయానికి, అక్కడ నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. మొత్తం 535 కిలోమీటర్ల పొడవునా కాలువలు, ఎత్తిపోతలు, పైపులైన్లు ఉంటాయి. మొత్తం 9 చోట్ల నీటిని ఎత్తిపోయాలి.
- అంచనా వ్యయం: రూ.64,700 కోట్లు (రోజుకు 2 టీఎంసీలు); రూ.68,998 (రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే).
3: కృష్ణా నదిలో గోదావరి జలాలు కలుపుతూ బనకచర్లకు మళ్లింపు