GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం ప్రారంభం
11:36 September 17
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం
హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బి.పి. పాండే కన్వీనర్‌గా గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం చర్చలు జరుపుతోంది. సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు... రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు పాల్గొన్నారు.
గతంలో జరిగిన బోర్డుల సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సమన్వయ కమిటీ స్థానంలో ఉప సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇవాళ హైదరాబాద్ జలసౌధలో ప్రారంభమైంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం కూడా సమావేశం కానుంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై ఉపసంఘం సభ్యులు చర్చిస్తున్నారు.
ఇదీ చదవండి: Gold Rate Today: భారీగా తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..