Movie ticket price increase in telangana: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై వివాదం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త టికెట్ ధరలు ఈనెల 21 నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర 50 రూపాయలుగా నిర్ణయించింది. ఏసీ థియేటర్లలో టికెట్ గరిష్ఠ ధర రూ.150 చేసింది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30 రూపాయలు.. గరిష్ఠ ధర రూ.70 రూపాయలుగా నిర్ణయించింది.
మల్టీప్లెక్స్, ఐమాక్స్‌ల్లో టికెట్ కనీస ధర రూ.100 రూపాయలు వసూలు చేసుకోవచ్చన్న ప్రభుత్వం.. గరిష్ఠ ధర రూ.250 వరకు తీసుకొవచ్చని తెలిపింది. మల్టీప్లెక్స్ రిక్లయినర్ టికెట్ గరిష్ఠ ధర రూ.300గా నిర్ణయించింది. సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీ.. ఏసీ థియేటర్లలో టికెట్‌పై 5 రూపాయల నిర్వహణ రుసుం అదనమని స్పష్టం చేసింది.
తెలంగాణలో పెరిగిన సినిమా టికెట్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి..
- ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.50/-.. గరిష్ఠ ధర రూ.150/-
- నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30/-... గరిష్ఠ ధర రూ.70/-
- మల్టీప్లెక్స్‌లలో టికెట్ కనీస ధర రూ.100/-
- మల్టీప్లెక్స్, ఐమాక్స్‌లో టికెట్ గరిష్ఠ ధర రూ.250/-
- మల్టీప్లెక్స్ రిక్లయినర్ టికెట్ గరిష్ఠ ధర రూ.300/-
- సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఏసీ థియేటర్లలో నిర్వహణ ఛార్జీ కింద టికెట్‌పై రూ.5 అదనంగా వసూలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది.
ఏపీలో సినిమా టికెట్ల ధరలు..
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు ఉంది.