COMPLAINT: జోగి రమేశ్ డ్రైవర్ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు - ఏపీ తాజా వార్తలు
12:02 September 18
Gnt_Jogi Ramesh driver complaint registerd_Breaking
చంద్రబాబు నివాసం వద్ద నిన్న జరిగిన ఘటనలపై తాడేపల్లి పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ డ్రైవర్ తాండ్ర రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం నేతలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ఇక ఎమ్మెల్యే జోగి రమేశ్‌తోపాటు వైకాపా నేతలపై తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై సాధారణ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేశ్ డ్రైవర్ రాము ఎస్సీ కావడంతో.. తెలుగుదేశం నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: CHANDRABABU: చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై కేసులు నమోదు