ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గీతం వర్శిటీ నిర్మాణాల కూల్చివేత... ఏం జరిగిందంటే..? - విశాఖ గీతం విశ్వవిద్యాలయం వార్తలు

గీతం విశ్వవిద్యాలయం భూ ఆక్రమణలో వివాదంలో చిక్కుకుంది. పెద్ద ఎత్తున భూమిని గీతం వర్సిటీ ఆక్రమించుకుందంటూ రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిగా చెబుతున్న ప్రదేశంలో నిర్మాణాల్ని కూలగొట్టింది. గీతం ప్రధాన ప్రవేశ ద్వారం మొదలు ప్రహారీ గోడల్ని సైతం కూల్చి వేశారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రసిద్ధ విద్యా సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహరించడంపై గీతం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

gitam  university
gitam university

By

Published : Oct 24, 2020, 11:00 PM IST

గత కొద్ది కాలంగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు తాజాగా గీతం విశ్వవిద్యాలయం వరకు వచ్చాయి. 40 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని గీతం ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ భూమిని స్వాధీన పరుచుకునే దిశగా శనివారం తెల్లవారుజామున చర్యలు ప్రారంభించారు.

ఉదయం 3గంటలకే...

ఉదయం 3గంటల సమయంలో గీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు రెవెన్యూ అధికారులు వచ్చారు. సెక్యూరిటీ పోస్టుతో పాటు అటుఇటు ఉండే గోడలను కూల్చివేశారు.ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే గీతం యాజమాన్యానికి సమాచారం అందించినట్లు అధికారులు చెప్పారు. ఆ తరువాత గీతం మెడికల్ ఆసుపత్రి వైపు చేరుకున్నారు. నార్త్ గేట్ కి ఆనుకుని ఉన్న మైదానం వైపు ఉన్న గోడను పూర్తిగా కూల్చారు. రెండు జేసీబీలతో కొద్దినిమిషాల వ్యవధిలోనే మెయిన్ రోడ్డు నుంచి నార్త్ గేట్ వరకు ఉన్న గోడను తొలగించి భూమిని స్వాధీన పరుచుకున్నారు. ఒకటిన్నర ఎకరా ఆక్రమిత స్థలంలో వివిధ నిర్మాణాలు ఉన్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. తదుపరి దశలో నిర్మాణాల తొలగింపు చేపడతామని చెప్పారు.

ఖండించిన ఉద్యోగులు...

గీతం విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వ ధోరణిని గీతం ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విద్య, వైద్య రంగాల్లో ఎంతో సేవ చేస్తున్న వర్సిటీపై ప్రభుత్వం వివిధ కారణాలతో ఈ రీతిలో వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. హుద్ హుద్ విధ్వంసం, కొవిడ్ మహమ్మారి వంటి కష్ట కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక విధాలుగా గీతం సహకారం అందించిందని గుర్తు చేశారు. కొవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తున్న ఆసుపత్రి ప్రహారీ గోడను కూల్చి వేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాజమాన్యానికి ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదని... కనీస ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ శాఖ కూల్చి వేతల ప్రక్రియ చేపట్టిందని చెప్పారు. కూల్చి వేత ప్రక్రియ కోసం ప్రభుత్వం గీతం వర్సిటీ చుట్టు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది.

ఇదీ చదవండి

జగన్​కు విధ్వంసం అంటే ఇష్టం అనుకుంటా: నారాయణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details