ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 15, 2020, 10:33 PM IST

ETV Bharat / city

కుటుంబీకుల జాడ కోసం పాకిస్థాన్​ నుంచి బాసరకు..

20 ఏళ్ల కిందట తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన గీత.. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహకారంతో స్వదేశానికి చేరింది. వారి కుటుంబీకుల జాడ కోసం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని బాసరకు ఈరోజు వచ్చింది.

బాసరకు వచ్చిన గీత
బాసరకు వచ్చిన గీత

ఐదేళ్ల కిందట విదేశాంగశాఖ సహకారంతో పాకిస్థాన్ నుంచి స్వదేశానికి వచ్చిన దివ్యాంగురాలు గీత.. కుటుంబ సభ్యుల జాడ వెతుక్కుంటూ తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని బాసర పట్టణానికి చేరుకుంది. మధ్యప్రదేశ్​కు చెందిన స్వచ్ఛంద సంస్థ సాయంతో తన వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాను బధిరురాలినని.. తాను చిన్నప్పుడున్న ప్రాంతంలో గోదావరి పక్కన గుడి, రైల్వే వంతెన ఉన్నట్లు సంస్థ సభ్యులకు ఆమె తెలిపింది. ఈ సమాచారంతో మహారాష్ట్రలో కొన్ని రోజులు వెదకగా.. ఈరోజు గోదావరి తీరంలో పరిసరాలను సంస్థ సభ్యులు ఆమెకు చూపించారు.

ఇరవై ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్ వెళ్లిన దివ్యాంగురాలు గీత.. అక్కడున్న ఈద్ సేవా సంస్థలో 15 సంవత్సరాలు ఉంది. వారు ఆమెకు గీత అని నామకరణం చేశారు. ఈ విషయం అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి రావడం వల్ల.. గీతను స్వదేశానికి తీసుకువచ్చారు. అప్పటినుంచి ఓ సేవా సంస్థలో ఆశ్రయం పొందుతోంది. తాను కుటుంబీకుల వద్దకు వెళ్తానని కోరగా.. ఆనంద్ సేవా సంస్థ సభ్యులు వారి వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించి ప్రయత్నాలు ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details