కేసీఆర్ తాతయ్య నీకు కరోనా తగ్గిపోవాలని కోరుకుంటున్నామంటూ ఇద్దరు చిన్నారులు ప్లకార్డుల ప్రదర్శన చేశారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సుదర్శన్ ప్రైవేటు ఉపాధ్యాయుడు. ఆయనకు ప్రణవి, సంజన ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ కేసీఆర్కు ధన్యావాదాలు తెలుపుతూ... ఆయనకు కరోనా త్వరగా తగ్గిపోవాలని ప్లకార్డులు రాసి ప్రదర్శించారు.
'కేసీఆర్ తాతయ్య త్వరగా కోలుకోవాలి' - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు
కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడంపై ఇద్దరు చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆయనకు కరోనా తగ్గిపోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్న చిన్నారులు
కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతినెల 25 కిలోల బియ్యంతో పాటు కొంత నగదు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చిన్నారులు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చిన్నారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:కరోనాతో ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారా.. ఇంటికే ఆసుపత్రి!