ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

daughter killed mother : అమానుషం... తల్లిని దారుణంగా హత్య చేసిన కుమార్తె - రంగారెడ్డి నేర వార్తలు

హైదరాబాద్​ నగర శివారు చింతల్ మెట్​లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లిని కుమార్తె గొంతు నులిమి హత్య చేసింది.

అమానుషం... తల్లిని దారుణంగా హత్య చేసిన కుమార్తె
అమానుషం... తల్లిని దారుణంగా హత్య చేసిన కుమార్తె

By

Published : Oct 18, 2021, 11:00 PM IST

హైదరాబాద్​ నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ మెట్​లో దారుణం చోటు చేసుకుంది. తమ ప్రేమకు అడ్డు వస్తున్నారన్న నెపంతో ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిందో యువతి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి యాదమ్మ గొంతు నులిమి కుమార్తె నందిని, ఆమె ప్రియుడు చోటూ హత్య చేశారు. స్థానికుల సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details