తెలంగాణలోని హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాలను ఒక్కొక్కటిగా నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు. వినాయక సాగర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఓ వైపు నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుండగానే.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. రహదారులపై వ్యర్థాలు, చెత్తను శుభ్రం చేస్తున్నారు.
కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం.. వ్యర్థాలు తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ - Tank Bund
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ ఎప్పటికప్పుడు తొలగిస్తోంది.
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం