ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్న అధికారులు... 21న నామినేషన్ల పరిశీలించనున్నారు. 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చారు. డిసెంబర్ 1న ఉదయం 7 నుంచి 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
రిజర్వేషన్లు...
- జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్టీ-2(జనరల్ 1, మహిళ1)
- జీహెచ్‌ఎంసీ వార్డు రిజర్వేషన్లు: ఎస్సీ-10(జనరల్ 5, మహిళలు 5)
- జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు: బీసీ-50(జనరల్ 25, మహిళలు 25)
- జీహెచ్ఎంసీ వార్డు రిజర్వేషన్లు: జనరల్ మహిళ-44, జనరల్-44