హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేట వాహెద్ నగర్ కంటోన్మెంట్ జోన్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పర్యటించారు. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు అధికారులు తీసుకుంటున్న క్షేత్రస్థాయి చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి కరోనా పాజిటివ్ వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రజలెవరూ బయటకు రావద్దు: కమిషనర్
హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేట పరిధిలోని కంటోన్మెంట్ జోన్‌లో అధికారులు తీసుకుంటున్న చర్యలపై... జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆరా తీశారు. వాహెద్ నగర్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి కరోనా రావడం వల్ల క్షేత్రస్థాయి చర్యలు చేపట్టారు. సోమవారం కుర్మగూడలో కూడా 8 మందికి కొవిడ్ నిర్ధరణ అయినందున అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ghmc-commissioner-lokesh-kuma
ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి.. ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. సోమవారం.. మాధదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలోని కుర్మగూడలో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ ప్రాంతంలోనూ అధికారులు కొవిడ్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇవీ చూడండి:'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'